లగ్నం

ముహూర్తానికి లగ్న బలం ఉండాలి.అష్టమశుద్ధి కూడా ఉండటం మంచిది. కేంద్రములో శుభ గ్రహాలు, 3, 6, 11ఇంట త్రిషడాయాలలో పాపగ్రహాలుండాలి.ముహూర్త లగ్నాత్ కేంద్రస్థానంలో బుదుడుంటే 500 దోషాలను, శుక్రుడుంటే 5000 దోషాలను, గురుడుంటే 1,00,000 దోషాలను పోగొడతాడు.లాభంలో రవి వున్న మంచిది,లగ్నం పుస్కరాంశ లో వున్నా మంచిది,లగ్నం శుభ షష్ట్యంశలో ఉన్న శుభఫలము, రాశిచక్రంలోను, నవాంశ చక్రంలోను లగ్నం ఒకే రాశిలో ఉంటే లగ్నం వర్గోత్తమం చెందగలదు, లగ్నము నుండి 1,4,7,10 స్థానములు. వీటిని విష్ణుపాదములు అందురు,,లగ్నము నుండి 5,9 స్థానములు వీటిని లక్ష్మీ స్థానములు అందురు.

No comments:

Post a Comment