నక్షత్రాలు – ఫలములు

కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు . వారిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు – అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.

నక్షత్ర సంజ్ఞా విధము
1. క్షిప్ర నక్షత్రములు :- అశ్వని, హస్త, పుష్యమి
2. దారుణ నక్షత్రములు :- మూల, ఆరుద్ర, జ్యేష్ట, ఆశ్రేష
3. మృదు నక్షత్రములు :- చిత్త, రేవతి, మృగశిర, అనూరాధ
4. స్థిర నక్షత్రములు :- రోహిణి, ఉత్తరాషాడ, ఉత్తరా బాద్ర
5. చర నక్షత్రములు :- స్వాతి, పునర్వసు, శ్రవణము, ధనిష్ట, శతతార
6. ఉగ్ర నక్షత్రములు :- భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర 

 నక్షత్రాలు – దేవతలు
  1. అశ్వని – అశ్వని దేవతలు, 
  2. భరణి – యముడు, 
  3. కృత్తిక – అగ్ని, 
  4. రోహిణి – బ్రహ్మ, 
  5. మృగశిర – చంద్రుడు, 
  6. ఆరుద్ర – శివుడు, 
  7. పునర్వసు – అదితి, 
  8. పుష్యమి – గురుడు,
  9. అశ్రేశ – సర్పములు, 
  10. మఖ – పితృదేవతలు, 
  11. పుబ్బ – బృగుడు, 
  12. ఉత్తర – అర్యముడు, 
  13. హస్త – సూర్యుడు, 
  14. చిత్త – ఇంద్రుడు, 
  15. స్వాతి – వాయుడు, 
  16. విశాఖ – ఇంద్రాగ్నులు,
  17. అనూరాధ – మిత్రులు, 
  18. జ్యేష్ట – దేవేంద్రుడు, 
  19. మూల – రాక్షసుడు, 
  20. పూర్వాషాడ – ఉదకములు, 
  21. ఉత్తరాషాడ – విశ్వేదేవతలు, 
  22. శ్రవణం – విష్ట్నువు, 
  23. ధనిష్ట – వసువులు, 
  24. శతభిషం – వరుణుడు, 
  25. పూర్వ భాద్ర – అజచరణుడు, 
  26. ఉత్తరా భాద్ర – ఆహిర్భుద్నుడు, 
  27. రేవతి – పూషుడు
ఒక్కొక్క నక్షత్ర ప్రమాణము =360

No comments:

Post a Comment