ఏ రత్నాలు ఎలా కలిపి ధరించాలి

రవి, చంద్ర, కుజ, గురు, శని, బుధ, శుక్ర, రాహు, కేతువులని కలిపి మనం నవగ్రహాలని అంటాము. అలాగే వారికి సంబంధించిన రత్నాలు కలిపి 9. వాటిని నవరత్నాలు అంటారు. ఇప్పటిదాకా భవిత ద్వారా పాఠకుల కొరకు నవరత్నధారణ గురించి, ఎవరు ఏది ధరించాలి? అన్న విషయాలు చెప్పినప్పటికీ కొందరికి ఈ రత్నధారణ విషయంలో వున్న సందేహాల రీత్యా విపులంగా చెపుతున్నాను. ఈ శీర్షికని జాగ్రత్త చేసుకోగలరని మనవి.

మనుష్యూల మధ్య స్నేహసంబంధాలు....
శ్త్రుత్వాలు ఉన్నట్టి గ్రహాల మధ్య కూడా అదే పద్ధతి వుంది అన్ని ముఖ్యంగా గమనించాలి.

రవి, చంద్ర, కుజ, గురు, కేతువు - ఒక విభాగం
శుక్ర, శని, రాహు, బుధ - మరొక విభాగం

ఇందులో....
రవి - కెంపు
చంద్ర - ముత్యం
కుజ - పగడం
గురు - పుష్యరాగం
కేతు - పిల్లికన్ను రాయి
బుధ - ఎమరాల్డ్‌ పచ్చ (గరుడపచ్చ)
శుక్ర - డైమండ్‌ (వజ్రం)
రాహు - గోమేధికం
శని - నీలం (మయూర నీలం, ఇంద్రనీలం, కాకి నీలం)

ఏ వేలికి ధరించాలి?
రవి - ఉంగరం వ్రేలుని, చూపుడు వ్రేలికి కూడా
చంద్ర - వుంగరం వ్రేలు, చూపుడు వ్రేలికి కూడా
కుజ వుంగరం వ్రేలు, చూపుడు వ్రేలికి కూడా
గురు చూపుడు వ్రేలు, వుంగరం వ్రేలు
కేతు చూపుడు వ్రేలు, వుంగరం వ్రేలు
అంటే పైన పేర్కొన్నట్లుగా కెంపు, ముత్యం, పగడం, పుష్యరాగం, పిల్లికన్నురాయి ఏది ధరించాలలన్నా వుంగరం, చూపుడువ్రేలికి దేనికైనా ధరించవచ్చు. ఎవరికన్న కెంపు, పుష్యరాగం ధరించాల్సి వచ్చినపుడు కుడిచేతి రవికి సంబంధించిన వుంగరం వ్రేలికి గాని, గురువుకి సంబంధిత చూపుడు వ్రేలికి గాని కలిపి ధరించవచ్చు. అంటే రవి, గురులు మి్త్రులు కనుక ఇద్దరికి సంబంధించిన వ్రేళ్ళు (చూపుడు వేలు, వుంగరం వేలు) దేనికి ధరించినా ఫర్వాలేదు. అలాగే పుష్యరాగం, ముత్యం కూడా ఇలాగే ధరించవచ్చు. కొందరికి పగడం, పుష్యరాగం, ముత్యం కూడా ఇలాగ ధరించవచ్చు. కొందరికి పగడం, పుష్యరాగం కలిపి ధరించాల్సి వస్తే...

పగడం (వుంగరం వ్రేలు), పుష్యరాగం (చూపుడు వ్రేలు) కలిపి రెంటికి దేనికైనా ధరించవచ్చు. కుజ, గురులు మిత్రులు కదా! అంటే రవి, గురు, కుజ, కేతు, చంద్రులు మిత్రువర్గం కనుక వారికి సంబంధించిన రత్నాలు (1గాని, 2గాని, 3గానీ) కలిపి ‘‘చూపుడు వేలు, వుంగరం వేలు దేనికి పెట్టినా తపలేదు. మంచి ఫలితం వుంటుంది.

అలాగే శుక్ర, బుధ, శని, రాహువు మిత్రులు కనుక వారికి సంబంధించిన రత్నాలు ధరించేపుడు కూడా కలిపి ధరిస్తే తపకాదు అని భావన. బుధ, సంబంధిత (పచ్చ); శని సంబంధిత (నీలం) కలిపి ధరించేటపుడు బధునికి సంబంధించిన ‘‘చిటికిన వేలు గాని, శనికి సంబంధించిన మధ్య వేలు గాని’’ మంచిది. కొందరు గోమేధికం, నీలం కలిపి ధరంచాల్సి వస్తే ‘‘కుడి చేతి మధ్యవేలు గాని, చిటికెన వేలుగాని తప్పులేదు అని అర్ధం చేసుకోవాలి. మనుష్యూలలాగే శుత్రుత్వం వుంటుంది, మిత్రుత్వం వుంటుంది. మిత్రులంతా ఒకే చోట ఉంటే తప లేనట్లే ఏ వర్గానికి చెందిన రత్నాలు ఆ వర్గానికి సంబంధించిన గ్రహాల సంబంధిత వ్రేళ్ళకి ధరించటం వల్ల ఏమీ ప్రమాదం లేదు.

* గురువర్గం - గురు, రవి, చంద్ర, కేతు, కుజ
రత్నాలు ‘‘చూపుడు వేలు, వుంగరం వేలుకి కలిపి ధరించవచ్చు’’ లేదా విడివిడిగా పెట్టుకోగలిగితే పుష్యరాగం చూపుడు వేలు, కెంపు, పగడం వుంగరం వేలు పెట్టవచ్చు. కలిపి పెట్టినా..... విడిగా పెట్టినా గురువర్గ రత్నాలు ‘‘చూపుడు వేలు, వుంగరం వేలు’’కి ధరించటం మంచిది.
* శుక్రవర్గం - బుధ, శుక్ర, శని, రాహు రత్నాలు మధ్యవేలు, చిటికెన వేలుకి కలిపి ధరించవచ్చు లేదా విడివిడిగా పెట్టుకోగలిగితే నీలం మధ్యవేలు, పచ్చ చూపుడు వేలు, గోమేధికం మధ్యవేలుకు పెట్టుకోవచ్చు. కలిపి పెట్టినా, విడిగా పెట్టినా శుక్రవర్గ రత్నాలు మధ్యవేలు, చిటికెన వేలుకి మ్త్రామే ధరించటం మంచిది.

డైమండ్‌ ఎపుడు ఎడమ వేలు మధ్యవేలికి ధరించాలి. కేవలం నీలం మాత్రమే అయితే కుడిచేతి మధ్యవేలుకు సరిపోతుంది. 2,3 రత్నాలు కలిపి ధరించాల్సి వస్తే అపుడు ఈ పద్ధతి తపలేదు.

అంటే ఉదా :
ఎవరన్నా వ్యక్తి పచ్చ, నీలం కలిపి ధరించాల్సి వస్తే పచ్చ కుడిచేతి చిన్నవేలు, నీలం కుడిచేతి మధ్యవేలుకి విడివిడిగాను ధరించవచ్చు. లేదా అన్ని వుంగారాలు ఇష్టం లేనపుడు రెండూ కలిపి ఒకటే వేలు (అంటే పచ్చ అధిపతి బుధ సంబంధిత వేలు చిన్న వేలు గాని, దాని సంబంధిత వేలు కుడిచేతి మధ్యవేలు కనుక ఈ రెంటిల ఏదైనా) కి ధరించటం సర్వ సాధారణం. చాలా మంది పాఠకులు ‘‘అయ్యో మాకు 3 రత్నాలు ధరించాల్సి వచ్చింది (నీలం, పచ్చ, గోమేధికం అయితే ఎండు కలిపి మధ్యవేలికి, ఇంకోటి చిన్న వేలికి గాని... 3 కలిపి మధ్యవేలికి, చిటికెన వేలికి గాని ధరించవచ్చు) మరి మధ్యవేలికి 3 కలిపి పెడితే పచ్చ ఎప్పుడు చిన్నవేలికే పెట్టాలిగా? దీనివల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా? అనో... జరిగిపోయిం దనే... లేదా ఎవరో పురోహితుడు చెప్పాడని చెప్తూ వుంటారు. ఇది చాలా తప అన్ని గ్రహించలి మరి. ఎందుకంటే ఉందే చెప్పినట్లుగా గ్రహాలకి శుక్రవర్గ రత్నాలు తీసుకెళ్ళి గురువర్గ రత్నాలు ధరించే వేళ్ళకి పెట్టటం సరికాదని గమనించాలి.

చాలామంది ‘‘నీలం’’ కుడిచేతి వుంగరం వేలికి, పచ్చ తీసుకెళ్ళి వుంగరం, చూపుడు వేలకి ధరిస్తూ ఉంటారు అది తప... ఎందుకంటే వుంగరం, చూపుడు వేలు కూడా గురువర్గం కనుక శని, బుధ సంబంధిత రత్నాలు పనికిరావు. మరి కొందరు డైమండ్‌ వుంగరం వేలికి పెడతారు.

No comments:

Post a Comment