జన్మ నక్షత్రదోషములు

మూల:
ఈ నక్షత్రమున పుట్టినవాడు అభిమానం కలవాడును-ధనవంతుడును-సుఖమంతుడును-భోగమంతుడును-ధర్మపరుడును-బంధుపోషకుడును-ఎర్రని దేహకాంతి కలవాడును-శౌర్యవంతుడును అగును.

నక్షత్ర దోషము: మూల నక్షత్ర ఋక్షేద్వంతముల ప్రమాణమును 12 సమాన భాగములుగా చేయగా అందు 1వ భాగమున శిశువు జన్మించిన, 2వ భాగమున శిశువు జన్మించిన తల్లికి దోషము, 3వ భాగమున శిశువు జన్మించిన సోదరులకు హాని, 4వ భాగమున శిశువు జన్మించిన సోదరిలకున్నూ, 5వ భాగమున శిశువు జన్మించిన మామకు దోషం, 6వ భాగమున శిశువు జన్మించిన తండ్రి తోడబుట్టిన వారికి దోషము, 7వ భాగమున శిశువు జన్మించిన తల్లితోడబుట్టిన వారికి దోషము, 8వ భాగమున శిశువు జన్మించిన ధనమునకు హాని కలుగును, 9వ భాగమున జన్మించిన శిశువుతో జీవనమునకు హాని కలుగును.
10వ భాగమున శిశువు జన్మించిన దారిద్య్రం సంభవించును, 11వ భాగమున శిశువు జన్మించిన భృత్యులకు దోషము కలుగును, 12వ భాగమున శిశువు జన్మించిన జాతకునకు హాని కలుగును. పైన చెప్పిన దోషము మూడు మాసాల వరకూ ఉండును. రుూ దోష నివారణకు హోమశాంతులు జరిపించి, మహిష దానం చేసిన దోష నివారణము అగును. ఫలితంగా శాంతి, సౌభాగ్యములు కల్గుననియు ప్రాచీన గ్రంథములు తెల్పుచున్నవి.


పూర్వాషాడ:

ఈ నక్షత్రమందు పుట్టినవారు ప్రసన్నమైన ముఖముకలవారు, మిక్కిలి వినయ విధేయులు కలవారు, దానశీలురు గోసం రక్షకులుగా, దుఃఖవంతులుగా, కారుణ్యముకలవారు, అభిమానవంతులైన వారు అగును.
నక్షత్ర దోషము:
పూర్వాషాడ 3వ పాదము చిత్త 1-2 పాదములు ఇందులో మగ శిశువు జననమయిన తండ్రికి అరిష్టము, ఆడ శిశువు పుట్టిన తల్లికి అరిష్టము ల్గును. మరియు పూర్వాషాఢ- పుష్యమి నక్షత్రము నందు 1వ పాదము నందు పితృగండమును, 2వ పాదమున మాతృగండమును, 3వ పాదము నందు శిశువుకు అరిష్టమున్నూ, 4వ పాదమున మేనమామకు అరిష్టము కల్గును.


ఉత్తరాషాడ:
ఈ నక్షత్రమునందు జన్మించినవాడు చేసిన మేలు మరవని వాడు, ధార్మికుడు,శూరుడు, ప్రజ్ఞావంతుడు, వినయ విధేయతలు కలవాడు, మంచి రూపవంతుడు అగును.
నక్షత్ర దోషము: ఈ నక్షత్రమునకు దోషము లేదు. గ్రహారాది దోషములు సంభవించిన శాంతి చేసుకోవాలి. విషఘటికా దుర్ముహర్త దోషములు జననమునకున్న దోష నివారణకు దానాది శాంతులు జరుపుకోవలెను.

శ్రవణం:
ఉదారుడు, శాస్త్ర పండితుడు, ధైర్యవంతుడు,విద్వాంసుడు, మంచి వక్త, ధనవంతుడు, అరవై నాలుగు కళలు నేర్చినవాడు, సమస్తమును ఎరిగిన వాడు, ధర్మపరుడు అగును.
నక్షత్ర దోషం:
ఈ నక్షత్రమునకు శాంతి లేదు. అమావాస్య మొదలగు దోషకాల మందు, గ్రహణ కాలమందు, మరియు త్యాజ్య కాలమందును జననమయిన శాంతి చేసుకొని తీరవలయును.

దనిష్ట:
ఈ నక్షత్రము నందు పుట్టినవాడు ధర్మమునందు నిలకడ కలిగినవాడుచ, వ్యసనపరుడు, క్రూరుడు, క్షయరోగి, గూఢముగా అపరాధములు చేయువాడు, పరభార్యాసక్తుడు, శూరుడు అగును.
నక్షత్ర దోషము:
ఈ నక్షత్రమునకు దోషము లేదు. యితర విషఘటికాది దోషములున్న శాంతి జరుపవలయును.


శతభిషము:
ఈ నక్షత్రము నందు పుట్టినవాడు కుత్నిడున్ను-భార్యయందు ఆసక్తిపరుడు, కపట వర్తనము కలవాడు, విశాలమైన అవయవములు కలవాడు, సుఖమును పొందువాడు, దుష్టుడును అగును.
నక్షత్ర దోషము:
ఈ నక్షత్రమునకు దోషము లేదు. యితర దోషములున్న తత్సంబంధమైన శాంతులు జరుపవలెను.

పూర్వాభాద్ర:
ఈ నక్షత్రమునందు జన్మించినవాడు వ్యసనపరుడు, స్ర్తీ్తల్రను స్వాధీనంలో నుండువాడు, నిగూఢంగా అపరాధములు చేయువాడు, పరులను నిందించువాడు, అధర్మాసక్తుడు, శూరుడు అగును.
నక్షత్ర దోషము:
ఈ నక్షత్రమునకు దోషము లేదని కొందరు, ఉన్నదని మరికొందరు చెబుతారు. దోషము లేదని చెప్పినా... పై ప్రమాణము వచనము ప్రకారంగా పూర్వ ఫల్గుణి-పూర్వాషాడ-పూర్వాభాద్రాది తొమ్మిది నక్షత్రములకు శాంతి జరుపవలెనని ప్రమాణీకరించుచున్నది.

ఉత్తరాభాద్ర:
ఈ నక్షత్రమున పుట్టినవాడు సంతానవంతుడు, ధర్మాసక్తుడు, మంచి వక్త, శత్రువులను జయించువాడు, సౌఖ్యము నిచ్చువాడు, ధృఢమైన నియమములను పాటించువాడు, సదా కామాసక్తుడు అగును.
నక్షత్ర దోషము: ఈ నక్షత్రమునకు శాంతి లేదు. ఇతర దోషములున్న శాంతి జరుపుకొనవలయును.

రేవతి:
ఈ నక్షత్రమున జన్మించినవాడు రూపవంతుడు-ధనవంతుడు-భోగములనుభవించువాడు-పాండిత్యము కలవాడు-చరరూప ధన సంపదలు కలవాడు-అతి కామము కలవాడు-దుర్గములను జయించువాడు-శూరుడు-పరదేశ వాసము చేయువాడు అగును.
నక్షత్ర దోషము:
ఈ నక్షత్రము 4వ పాదము నందు జననమైన పితృనకు అరిష్టము కలుగును. మూడు మాసముల వరకు దోషము. దోష నివారణకు శాంతి హోమాదులు జరిపి, సువర్ణదానము చేసిన దోష నివారణ గావించుకొనవలయును.

దోషనివారణ అనేది అన్నింటికీ మూలమంత్రము. దోష నక్షత్రమున పుట్టినంత మాత్రాన...దానికి పరిహారం లేదని చింతించకూడదు. ఒక్కో నక్షత్రానికీ ఒక్కో శక్తి ఉంటుంది. సమర్థులైన పండితులచే దోషనివారణ చేయించుకుంటే వారికి అన్నింటా విజయాలే.

No comments:

Post a Comment