నక్షత్రాలు-చేయదగిన పనులు

అశ్విని: గర్భాదానం, నామకరణం, రథారోహ ణం, పుర ప్రవేశం, చౌలమ్‌, వైద్యం, మంత్రోపదేశం, గృహారంభం, బీజావాపనం, వన ప్రతిష్ట, వ్యవసాయం, వర్తకం, ప్రయోగం, యాత్ర, అన్నప్రాసన, పట్టాభిషేకం, ఉద్యోగారంభం, క్రతువులు, వ్రాతపని, ఉపనయనం.

భరణి: యుద్ధారంభం, పోట్లాటలు, వధ, బంధనం, విషప్రయోగం, అగ్నికర్మలు, శస్తక్రర్మ, అమృతం, తాంత్రికం, జూదాలు, పునశ్చరణ, బిల ప్రవేశం, సేవక స్వీకారం, ధన గ్రహణ.

కృత్తిక: అప్పుతీర్చుట, దుష్ట కృత్యాలు, యోగం, ధనం భద్రపరచటం, ఔషధసేవనం, అగ్నిసంబంధితాలు, లోహకార్యాలు, పశువి క్రయం, ధాతువాదం, ఓషధీకరణ, కూపఖవ నం, మంత్రస్వీకారం, విషప్రయోగం.

రోహిణి: పుంసవనం, నామకరణం, వివాహం, చౌలం, సీమంతం, అన్నప్రాసన, ఉపనయనం, యజ్ఞయాగాదులు, పౌష్టిక కర్మలు, శాంతి, హోమ కర్మలు, నూతన వస్తధ్రారణ, ఆభరణ ధారణ, విద్యారంభం.

మృగశిర: ప్రయాణం, ఉద్యోగారంభం, పూజ, దేవతా ప్రతిష్ట, సీమంతం, ఆభరణం, గృహారంభం, ఉపనయనం, అక్షరాభ్యాసం, కృష్యారంభం, వ్రతాలు, నామకరణం, వివాహం, చౌలం, విద్యారంభం.

ఆరుద్ర:
ఆయుధ క్రియ, దుస్నేహం, అక్షరాభ్యాసం, గర్భాదానం, ఉపనయనం, ఈశ్వరప్రతిష్ట, దుర్మార్గ సందర్శనం, దుర్మార్గం, చోరక్రియ.

పునర్వసు: సీమంతం, ఉపనయనం, అన్నప్రాసన, సింహాసనం, నామకరణం, ఆభరణధారణ, కర్ణవేదనం, గృహారంభం, ఉద్యోగం, ఔషధసేవ, పుంసవనం, ఉయ్యాల్లో వేయడానికి, సింహాసన అధిరోహణం.

పుష్యమి:
యానం, ఉపదేశం, పశుసంగ్రహం, వాహనం, గృహకర్మలు, సీమంతం, నామకరణం, కృషి, చౌలం, గృహప్రవేశం, థృత్యస్వీకారం, అస్త్రగ్రహణం, పూజారంభం, నూతన ఆభరణ ధారణ, యాత్ర, విద్యారంభం, పట్టాభిషేకం, ఉపనయనం, నిత్యపాఠం.

ఆశ్లేష: మాయ, అగ్నిప్రవేశం, విషప్రయోగం, యుద్ధ ప్రయాణం, అనృత ప్రసంగం, అస్త్ర వినోదం, వాదం, వంతెన, అభిచార కర్మ, నుయ్యి, తటాకం, మంత్రస్వీకారం (హింసార్థక హోమకర్మలు)

మఘ: జూదం, వివాహం, వాపీకూపతటాకాదులు, వివిధ సర్ప మంత్రాలు, సమస్త మంత్రాలు, గయాది పితృతర్పణాలు, కర్ణవేదనం.

పుబ్బ: మంత్రప్రయోగం, విషప్రయోగం, అగ్నికర్మ, దొంగతనం, అస్తవ్రిద్యాభ్యాసం, వాిపీకూపతటాక ప్రతిష్ట, వృక్షస్థాపన, అక్షర స్వీకారం, జూదం, మద్యపానం, అభిఘాత కర్మ, శతృసంహారం, పేకాట.

ఉత్తర: దేవతాప్రతిష్ట, వివిధ భూషణధారణ, కృషి, చౌలం, వేద శాస్త్రారంభం, బీజావాపన, వివాహ, ఉపనయన, నామకరణ, అన్నప్రాసన, రథారోహణ, సీమంతం, పుంసవనం, చతుష్షష్టి కళాభ్యాసం, నూతన వస్తధ్రారణ, దేవతాపూజ, ఉద్యోగారంభం.

హస్త:
వివాహం, ఆభరణధారణ, చౌలం, సీమంతం, అక్షరస్వీకారం, యాత్ర, ఉద్యోగం, గృహారంభం, ప్రవేశం, నూతన వస్తధ్రారణం, నూతనాలంకారం, నామకరణం, ఉపనయనం, అన్నప్రాసన, ధాన్యసంగ్రహణ, ధనసంగ్రహణ, కూరగాయలు.

చిత్త: చౌలం, ఉపనయనం, అన్నప్రాశన, నామకరణం, ఉద్యోగం, సంభోగం, నాట్యారంభం, రథం, గుఱ్ఱం, ఏనుగుల శిక్షణలు. అన్ని అలంకరణలు, వైద్యం, కర్ణవేదన, చిత్రవిచిత్ర వ్యాపారం, గృహకర్మలు.

స్వాతి:
గర్భాదానం, ఉద్యానవనం, వివాహం, విద్యారంభం, మేడ, కృషి, అన్నప్రాశన, బీజావాపనం, అలంకారధారణ, నామకరణం, సంగీతారంభం, వన ప్రతిష్ట.

విశాఖ: బీజావాపనం, కృషి ప్రయత్నం తటాక, కూపసేతు పరిఘాది గని ప్రవేశం, దిగుడుబావులు, వృక్షస్థాపన.

అనూరాధ
: పల్లకి, ఎడ్లు, ఏనుగులు, గుఱ్ఱాలు లాంటి జంతువులకు పని నేర్పటం, గృహప్రవేశం, ఆభరణ, అభరణధారణ, ఉద్యోగ, యాత్ర, వివాహం, ద్రవ్య ప్రసంగం, సర్వ విద్యాభ్యాసం, చౌలం, అన్నప్రాసన, నామకరణం, ఉపనయనం.

జ్వేష్ట: యుద్ధం, శస్త్రం, అభిఘాతం, దహనం, కత్తి విషప్రయోగం, ధనుస్సు, మంత్రగ్రహణ, దుష్టకృత్యాలు, పశువిక్రయం, దాస దాసీ స్వీకారం, శత్రువిజయం.

మూల: యాత్ర, మేడ, వివాహం, యజ్ఙయాగాదులు, చౌలం, వైద్యం, వాపీకూపాదులు, నామకరణం, గర్భదానం, బీజావాపనం, తరుగుల్మాది ప్రతిష్ట, ఉపనయనం, విద్యారంభం.

పూర్వాషాఢ: వాపీకూపాదులు, ధనుర్విద్యాభ్యాసం, నిధి, చౌర్యం, ద్రవ్య ప్రసంగం, గణితశాస్త్రం, తటాకాలు, బీజావాపనం, వేదాంత శాస్త్రం, పశుసంగ్రహం, అభిచారకృత్యం, హింసార్థకమైన కర్మలు, ఋణవిమోచనం.

ఉత్తరాషాఢ: విద్యాభ్యాసం, అన్నప్రాసన, గృహకర్మలు, వాహనాలు, చౌలం, సీమంతం, నామకరణం, ఉద్యోగం, గర్భదానం, దేవాగారం, ఆభరణం, ఉత్సవాలు, బీజావాపనం, వివాహాదులు.

శ్రవణం: విద్యాభ్యాసం, అలంకారం, గృహకర్మలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, ప్రయాణం, కృషి, చౌలం, ఉపనయనం, రాజ్యాభిషేకం, యజ్ఞయాగాదులు, వైద్యం, కర్ణవేదం, గర్భదానం, నామకరణం.

ధనిష్ట: ఉపనయనం, అలంకారం, పట్టాభిషేకం, యాత్ర, అన్నప్రాసన, గృహకర్మలు, వాహనం, శాంతికర్మలు, గృహప్రవేశం, పశుక్రయవిక్రయాలు, గర్భదానం, వైద్యం, విద్యారంభం.

శతభిషం: వర్తకం, నామకరణం, అన్న ప్రాసన, ఉపనయనం, విద్య, కృషి, ఉద్యో గం, వాహనం, వైద్యం, గర్భదానం, చౌలం, యాత్ర, అక్షరాభ్యాసం, వడ్డీవ్యాపారం.

పూర్వాషాఢ: వాపీకూపాదులు, శస్త్రాస్త్ర శిక్షణ, శత్రుహరణం, జూదం, మంత్రతంత్ర శిక్షణ, అనుచిత కార్యారంభం.

ఉత్తరాభాద్ర: యాత్ర, యాగం, ఉద్యోగం, వైద్యం, చౌలం, సీమంతం, వివాహం, గృహకర్మలు.

రేవతి: ఉపనయనం, వివాహం, సమస్త విద్యలు, గృహ కర్మలు, అలంకారం, అక్షరాభ్యాసం, గర్భదానం, అన్నప్రాసన.

No comments:

Post a Comment