పలు కుటుంబాలలో... ఏవో కొన్ని సర్పాలను పెద్దవారు చేధించినందున, వాటి శాప ఫలితం అనుభవిస్తున్నామని, ఈ ఫలితాలు ఎంత కాలం ఉంటాయో అర్థం కావటం లేదని, దీని ప్రభావం చేత కుటుంబంలోని వారందరూ ఎదుగు బొదుగు లేని జీవితం అనుభవిస్తున్నారని అనుకుంటుంటారు. మరికొంతమందైతే.... ఆర్థికంగా బాగా బలపడినప్పటికీ, కుటుంబంలో సంతతి లేకుండాపోయిందని వాపోతుంటారు. మరికొంతమందైతే అన్నీ ఉన్ననూ, ఆర్థికంగా ఎదుగుదల ఉన్ననూ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ అనవసర వ్యవహారాలకి జైలు శిక్ష అనుభవిస్తున్నామని వాపోయేవారు కూడా ఉంటుంటారు. ఇంకొంతమంది రాత్రి సమయాలలో భయంకర సర్పాలు హింసపెడుతున్నట్టుగా స్వప్నాలు వస్తుంటాయి. ఇవన్నీ ఒకవైపున జరుగుతుంటే మరోవైపున కొంతమంది స్త్రీలకు తరచుగా గర్భస్రావాలు జరగటం లేదా శిశు మరణాలు ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సర్ప శాపాలేమో అనుకుంటుంటారు.
అసలు ఈ సర్పాలు శాపాలు పెడతాయా ? మరి జాతకాలలో ఉండే నాగ దోషాలకి, ఈ సర్ప దోషాలకి ఏదైనా తేడా ఉందా అని పరిశీలిస్తే.... జాతకాలలో కొన్ని ప్రత్యేకమైన గ్రహస్థితులు ఉంటుంటే వాటిని నాగ దోషాలు అంటుంటారు. మరి ఇలాంటి ప్రత్యేక గ్రహస్థితులు లేనివారికి కూడా... పైన చెప్పిన సమస్యలు వస్తుంటే, అప్పుడు అవి ఏ కోవకు చెందుతాయో ఆలోచించాలి.
ఇలా విశ్లేషిస్తే వీటిని సర్ప శాపాలుగా భావించాలని కొందరు పెద్దవారు చెబుతుంటారు. నాగదోషాలకు అనేక పరిహారాలు ఉన్నప్పటికీ, వాటిని ఈ సర్పశాపాలకు వినియోగించరాదు. ఈ సర్ప శాప నివృత్తి కోసం ఓ ప్రత్యేకమైన రాజమార్గ పరిహారం ఉంది. ఈ పరిహారమును ఆచరిస్తుంటే సర్ప శాప నివృత్తి క్రమ క్రమంగా తగ్గుతుంటుంది.
ఈ రాజమార్గ పరిహారం ప్రతినెలా ఒక్కసారి మాత్రమే ఆచరించాలి. ఆ విధంగా ఎన్ని మాసాలైనా ఆచరించవచ్చు. ఈ ఆచరించటానికి కొన్ని అంశాలను పాఠకులు తెలుసుకోవాలి. ప్రతినెలలో ఆశ్లేష నక్షత్రం ఏ రోజు వస్తుందో గుర్తించండి. ఆ నక్షత్ర రోజుకు ఏ వారం వచ్చినా ఫర్వాలేదు. కాని ఆ నక్షత్ర వారానికి ముందుగా వచ్చే ఆదివారాన్నే ఎన్నుకోవాలి. ఈ ఆదివారం నాడు ఒక పావుకిలో గోధుమలను తీసుకొనండి. ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, ఆ ముక్కలనుంచి వచ్చే రసాన్ని గోధుమలపై పిండండి. బాగా చేతితో కలపండి. ఆపైన ఆ గోధుమలను ఓ పళ్ళెంలో పోసి (ఏ పళ్ళెమైనా ఫర్వాలేదు) నీడలో ఆరపెట్టండి. రెండు మూడు రోజులైననూ ఫరవాలేదు. బాగా ఎండిన తర్వాత, ఆ గోధుమలను పిండి పట్టించండి. జల్లెడతో జల్లించవద్దు. ఇప్పుడు ఈ పిండితో దీపారాధన చేయాలి.
ఈ దీపారాధన ప్రతి నెలా ఆశ్లేషా నక్షత్రం వచ్చిన రోజున మాత్రమే దీపారాధన చేయాలి. ఒక్కసారి పావుకిలో పిండి తయారు చేసుకుంటే కనీసం ఆరు మాసాల వరకు ఉపయోగపడుతుంది. ఆశ్లేష నక్షత్రానికి నాలుగైదు రోజుల ముందుగా ఆదివారం వస్తే, గోధుమలలో నిమ్మరసం కలపటానికి, ఆరటానికి పిండి పట్టించటానికి బాగా సమయం ఉంటుంది. అలాకాక ఆశ్లేషకు ఒకరోజు లేక రెండు రోజుల ముందుగా ఆదివారం వస్తే, కేవలం గోధుమలను పూర్తిగా ఆరుటకు సమయం చాలదు. ఇలాంటి సందర్భాలలో ఒక నెలలో ఆశ్లేష ముందు ఆదివారం గోధుమలను సిద్దంచేసుకొని, మరుసటి నెల నుంచి పిండి దీపారాధన చేయవచ్చు.
ఇక్కడ మీకో అనుమానం కూడా రావచ్చు. ఏమిటంటే... అసలు గోధుమలను నిమ్మరసంలో కలపటానికి ఆశ్లేషకు ముందుగా వచ్చే ఆదివారం అవసరమన్నారు కదా.. మరి ఈ ఆదివారము ఆశ్లేష నక్షత్రం రోజునే వస్తే ఎలా ? ... అనుకోవచ్చు. ఇక్కడ నియమం ఏమిటంటే ఆశ్లేష నక్షత్రం వచ్చిన రోజు ఆదివారం అయినప్పటికీ.... దానికి ముందుగా వచ్చే ఆదివారమే తీసుకోవాలి. అంతేకాని ఆశ్లేషతో కలిసిన ఆదివారం తీసుకోకూడదు.
ఇక నియమం ఏమిటో తెలుసుకున్నారు. ఈ నియమం ప్రకారం పిండి తయారు చేసుకున్నారు. తయారు చేసిన పిండిని కొద్దిగా నీటితో కలిపి చపాతి ముద్దగా చేసుకొని, రెండు చిన్న చిన్న ప్రమిదలుగా చేసుకొనండి. ఈ ప్రమిదలలో మధ్య వత్తులు వేసి కొబ్బరి నూనెతో మాత్రమే వెలిగించాలి. ఈ వెలిగించిన ప్రమిదలను సింహద్వారానికి అటువైపు ఇటువైపు ఉంచుకొనేది.
సహజంగా దీప ప్రజ్వలన రాత్రి సమయాలలో చేస్తుంటాం. కానీ ఈ సర్ప శాప నివృత్తి దీపం మాత్రం ఆశ్లేష నక్షత్రం.... ఏ రోజున వస్తుందో.... ఆనాటి రాహుకాల సమయంలోనే వెలిగించాలి.
సోమవారం వస్తే ఉదయం 7.30 నుంచి 9.00 లోపల, శనివారం వస్తే ఉదయం 9.00 నుంచి 10.30 నిముషాల లోపల, శుక్రవారం వస్తే ఉదయం 10.30 నుంచి 12.00 లోపల, బుధవారం వస్తే మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 లోపల, గురువారం వస్తే మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 లోపల, మంగళవారం అయితే మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 లోపల, ఆదివారం అయితే సాయంత్రం 4.30 నుంచి 6.00 లోపల దీప ప్రజ్వలన చేయండి. ఆనాటి రాహుకాలం పూర్తయ్యేవరకు దీపాలు వెలుగుతుండాలి. ఈ ప్రకారంగా కనీసం 3 మార్లు ఆచరించాలి. అవకాశం ఉంటే అంతకంటే ఎక్కువ కూడా చేయవచ్చును.
మధ్య మధ్యలో ఒక నెల ఆగిననూ సమస్య ఏమి లేదు. గోధుమలలో నిమ్మరసం కలపటం, పిండితో ప్రమిదలు చేయటం ఎవరైననూ ఏ వయసు వారైననూ చేయవచ్చును. కానీ దీపాన్ని వెలిగించటం మాత్రం ఆ కుటుంబంలో ఉన్న వయసులో పెద్దవారే వెలిగించాలి. ఒకవేళ వైధవ్య స్త్రీ కనుక కుటుంబంలో పెద్దవారిగా ఉండిననూ వెలిగించవచ్చును. ఈ ప్రకారంగా ఆశ్లేష నక్షత్ర రోజున జంట దీపాలను సింహ ద్వారం దగ్గర వెలిగించి సర్ప శాప నివృత్తిని పొందండి. ప్రత్యేక నియమాలు, తలస్నానాలు, ఉపవాసాలు ఏమియును లేనే లేవు. రాహుకాలమంతా వెలుగుతూ ఉండేలా చూసుకొనేది.
ఈ అంశాన్ని మీ బంధు మిత్రులందరికీ తెలియచేయటానికి ప్రయత్నించండి. - శ్రీనివాస గార్గేయ - See more at: http://www.bhakthimala.tv/mid-38.html#sthash.umx9yU33.dpuf

No comments:
Post a Comment