సాధారణంగా లక్ష్మీదేవి అనుగ్రహ సిద్ధికై లక్ష్మి అష్టోత్తరాలు, సహస్రనామాలు, లక్ష్మీదేవి వ్రతాలూ, కనకధారా స్తోత్రాలు మొదలైనవి ఎన్నో పఠిస్తూ ఉంటారు. వీటితో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహ ప్రాప్తికి మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఆవుపేడతో చేసిన భస్మధారణతో లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ పరంపరలో ప్రధమంగా కార్తెల గురించి పాఠకులు తెలుసుకోవాలి. సూర్య భగవానుడు ఒక్కో నక్షత్రంలో ప్రవేశించటాన్నే కార్తె అని పిలుస్తారు.
జ్యోతిష శాస్త్ర రీత్యా సూర్యగ్రహ స్వక్షేత్రము సింహరాశి. సూర్యగ్రహ ఉచ్చ క్షేత్రము మేషరాశి. మేషరాశిలో సూర్యగ్రహ నక్షత్రం కృత్తిక 1వపాదం ప్రారంభమగును. సింహరాశిలో కూడా సూర్యగ్రహ స్వనక్షత్రం ఉత్తర నక్షత్రం 1వపాదం ఉండును. కృత్తిక నుంచి ఉత్తర వరకు మొత్తం 10 నక్షత్రాలు. ఈ 10 నక్షత్రాలలో లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రతి సంవత్సరం కృత్తిక కార్తె మే 11 లేదా 12 తేదిలలో ప్రారంభమగును. ఉత్తర కార్తె సెప్టెంబర్ 13 లేక 14 తేదిలలో ప్రారంభమగును. కృత్తిక కార్తె ప్రారంభం నుంచి తదుపరి రెండు రోజులు అంటే మే 11,12,13 తేదీలలోను, ఉత్తర కార్తె ప్రారంభం నుంచి తర్వాత రెండు రోజుల్లోనూ అంటే సెప్టెంబర్ 13,14,15 తేదీలలో ఆవుపేడను సేకరించాలి.
ఆవుపేడను సేకరించే సమయంలో చూడి ఆవుపేడ పనికిరాదు. తెలుసుకొని గమనించి పేడను సేకరించాలి. సేకరించిన ఆవుపేడలో దానిమ్మ కాయ తొక్కలను, విత్తనాలను పేడలో కలిపి పిడకలుగా చేసుకోండి. సంవత్సరానికి కేవలం మే 11,12,13 తేదీలు మరియు సెప్టెంబర్ 13,14,15 తేదీలలోను దానిమ్మ తొక్కలను, విత్తనాలను కలిపి పిడకలుగా చేసుకొనుటకు అవకాశం ఉంది.
పై ప్రకారం పిడకలను చేసుకొని ఎండపెట్టండి. ఎండిన పిడకలను చెదలు తదితర క్రిములు చేరకుండా భద్రంగా ఉండేలా ప్యాక్ చేసుకోండి. ఎండిన పిడకలో కొంత భాగం కాని లేక పూర్తిగా పిడకను గాని, మీకు అనుకూలం ఉన్న ఏ రోజైనా సరే భస్మం చేయాలి. పిడక మొత్తాన్ని కాకుండా, దాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని దానిపైన కర్పూరపు పొడిని చల్లండి. తర్వాత కర్పూరాన్ని మండించండి. ఇందుచే పిడక కూడా బాగా మండి, భస్మంగా తయారవుతుంది. ఒకేసారి ఎక్కువ భస్మాన్ని చేసుకోవద్దు. భస్మ వినియోగిస్తూ ఉండండి. భస్మం అయిపోగానే మరల ముక్కలతో భస్మాన్ని తయారు చేసుకోండి.
ఈ భస్మాన్ని ప్రతిరోజూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, సాధారణ స్నానం తదుపరి నుదుటన ధరించండి. ఈ విధంగా నిత్య భస్మ ధారణచే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయాలలో ఉద్యోగాలు చేసి, వేకువన వచ్చి నిద్రపోయేవారు ఉంటుంటారు. ఇలాంటి వారు ప్రతిరోజూ ఈ భస్మ ధారణను ఆచరించలేరు. కనుక ఇలాంటి వారు కనీసం శుక్రవారమైనా సూర్యోదయం లోపల స్నానం ఆచరించి భస్మాన్ని ధరించండి. ఈ విధంగా దానిమ్మ పిడకతో భస్మాన్ని ధరిస్తుంటే శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి కల్గి సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకుంటూ రాజమార్గాల వైపు వెళ్ళే అవకాశాలు వచ్చును.
గమనిక : పిడకలు చేయలేనివారు డబ్బిచ్చి కొనవద్దు. ఒకేసారి దురాశతో అధికంగా పిడకలను చేయవద్దు. ఒకవేళ మీరు అధికంగా పిడకలను చేస్తే, వాటిని ఇతరులకు ఉచితంగా ఇవ్వటానికి ప్రయత్నించండి. వ్యాపార ధోరణితో పిడకలను చేసి అమ్మటానికి ప్రయత్నించవద్దు. పిడకలు అమ్మినా, కొన్నా లక్ష్మి దేవి అనుగ్రహం ఉండదు. ఒకేసారి కేజీలు, కేజీలుగా భస్మాన్ని తయారుచేయకండి. పసిడి కంటే ఈ భస్మం ఎంతో విలువైనది. శ్రద్ధతో, విశ్వాసంతో, భక్తితో గ్రహించండి. - See more at: http://www.bhakthimala.tv/read.php?mid=32#sthash.6i8kcZcL.dpuf
No comments:
Post a Comment