శక్తిపీఠ దర్శనం సర్వపాపహారణం

ఈ ప్రపంచాన్ని శాసించే సర్వసత్తాక శక్తులుగా పేరొందిన శివుడు, విష్ణూవుతో పోటీపడి సర్వ జనులనూ ఆకట్టుకున్న దేవి ఆదిపరాశక్తి. ఆమె దయతోనే త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కారకాలను నిర్వహిస్తున్నార ని పురాణాలు చెబుతున్నారుు. నిగ్రహానుగ్రహ సామర్థ్యం గల సర్వశక్తి స్వరూపిణి, సర్వగ్రహ సంచారిణి, లోకానుగ్రహ కారిణి అమ్మవారు. ఆ అమ్మను ఆరాధించేందుకు మనదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నారుు. అష్టాదశ శక్తిపీఠాల్లో వెలసిన అమ్మవారికి ఎనలేని శక్తి ఉంటుందని భక్తుల విశ్వాసం. అరుుతే అందరికీ అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న శక్తి స్వరూపిణిని దర్శించుకోవడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో్ల ఏ ఒక్క పీఠాన్ని దర్శించుకున్నా అన్ని శక్తి పీఠాలను దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నారుు...

పార్వతీదేవి తండ్రి దక్షుడు మహాయజ్ఙం చేయ తలపెట్టి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిన కూతురు, అల్లుడిని ఆహ్వానించడు. దీంతో ఎలాగైనా యజ్ఙానికి వెళ్ళాలని పరమశివుడిని పార్వతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి రావడానికి శివుడు ఒప్పుకోడు. దీనిని అవమానంగా భావించిన పార్వతీదేవి ఉగ్రరూపిణిగా ఊగిపోతూ తన శరీరాన్ని 18 ముక్కలు చేసి విసిరి వేస్తుంది. ఆ శరీర భాగాలు భూలోకంలో 18 చోట్ల పడతాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిశాయని పురాణగాథ. ఈ అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శ్రీ శాంకరీ దేవి... ఈ పీఠం శ్రీలంకలో ఉంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయి. ఇది అష్టాదశ పీఠాల్లో ప్రథమ పీఠం. రావణుని స్తోత్రాలకు ప్రన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించింది. రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధానమైంది. రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది. ఇదీ ఈ శక్తి పీఠం యొక్క పురాణగాథ.

శ్రీ పురుహూతికా దేవి...
ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ హస్తం పడిందని చెబుతుంటారు. ఈ పీఠాన్ని అష్టాదశ పీఠాల్లో రెండవ పీఠంగా పేర్కొంటారు. పూర్వం ఏలుడు అనే ఋషి గంగ కోసం శివుని గురించి తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడు. తన జటాజూటంలోని గంగలోని ఒక పాయను వదిలిన శివుడు... వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపూ, గంగ వస్తుందని ఏలునితో చెప్పాడు. శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడి పుంజులా మారి కూశాడు. ఏలుడు వెనక్కి చూశాడు. గంగ ఆగి అక్కడ ఏలానదిగా మారింది. శివుడు కుక్కుటేశ్వరుడుగా మారాడు. ఈ క్షేత్రం అపరకర్మలకు ప్రసిద్ధి.

శ్రీ శృంఖలా దేవి... శృంఖలా దేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని ప్రతీతి. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖలా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారు.శ్రీ చాముండేశ్వరీ దేవి... ఈ శక్తి పీఠం కర్నాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి. సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భవించిన శక్తి స్వరూపం. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వాని ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి. దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని భక్తుల విశ్వాసం. మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.

శ్రీ కామాక్షీ దేవి... ఈ పీఠం తమిళనాడులో ఉంది. ఇది అమ్మవారి వీపు భాగం పడిన చోటు. కాత్యాయనమహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. కామాక్షి ఏకామ్రనాథుని అర్చించి కంచిలో వెలసింది. కాంచి అంటే వడ్డాణం. భూమికి వడ్డాణం స్థానంలో కంచి ఉందిట. ఇక్కడ విభిన్నాకారాలతో ఆకులు ఉండే ఒక మామిడి చెట్టు ఉంది. ఒక్కొక్క కొమ్మకు ఒక్కో రుచి ఉన్న పండు కాస్తుందని చెబుతారు.పార్వతిదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న ఈ కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. ఆదిశంకరులు ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు. మధుర మీనాక్షి, తిరువనైకవల్‌ లో ఉన్న అఖిలాండేశ్వరి, కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయాలవలే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెఱకుగడ, తామర పుష్పాన్ని, చిలుకను... పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది.

శ్రీ మహాలక్ష్మీ దేవి... ఈ పీఠం మహారాష్టల్రోని కొల్హాపుర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయి అని చెప్పుతారు. మహాలక్ష్మి అనే పేరు ఉండడం మూలంగా ఈ అమ్మవారిని శ్రీ మహావిష్ణువు భార్య అని అనుకుంటారు. కానీ, ఈమె విష్ణుపత్ని కాదు. 18 భుజాలతో రజోగుణంతో భాసిల్లుతున్న మహాశక్తి. ఇక్కడ అమ్మవారి పాదాలపై ఏడాదికి మూడుసార్లు సూర్యకిరణాలు పడతాయి. అలా సూర్యకిరణాలు పడే రోజులలో కిరణోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

శ్రీ జోగులాంబా దేవి...ఈ పీఠం ఆంధ్రప్రదేశ్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని శ్రీ జోగులాంబా దేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి పై దంతపంక్తి పడింది. దీని పూర్వనామం హలంపురం. ఇది హరిక్షేత్రం. ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం ఉంది. ఇది శ్రీశైలానికి పశ్చిమద్వారం.

శ్రీ భ్రమరాంబికా దేవి... ఈ శక్తి పీఠం ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీశైలంలో ఉంది. ఇది అమ్మ వారి మెడ భాగం పడిన చోటు. చంద్రమతి అనే రాజకుమార్తె, శివుని ధ్యానించి ప్రసన్నం చేసుకుని, తాను మల్లికగా మారి శివుని జటాజూటంలో ఉండే వరాన్ని పొందింది.

శ్రీ గిరిజా దేవి..., ఒరిస్సాలో వైతరణీనదీతీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి బాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. ఇక్కడి గిరిజాదేవి సింహవాహనగా కనిపిస్తుంది. అమ్మ వారు ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని దర్శనమిస్తుంది. ఈమె శక్తి త్రయరూపిణి.

శ్రీ ఏకవీరా దేవి... ఈ శక్తి పీఠం మహారాష్టల్రోని నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. ఇది అమ్మవారి కూడి హస్తం పడిన చోటు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శన మవుతుంది.

మంహంకాళీ దేవి... ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడిఉంది. ఇక్కడి నది సిప్ర. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమినుంచి కుజుడు విడిపోయిన ప్రాంత ఇది. అని జ్యోతిషశాస్తవ్రేత్తలు చేపుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అంర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది.

శ్రీ మాధవేశ్వరీ దేవి... ఈ పీఠం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా ఈ స్థలాన్ని చెబుతారు. బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో గాయాలు చేసినందున ప్రయాగగా మారింది. ఈమెను కృతియుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి.అమృతతీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాము డు, ద్వాపరంలో శ్రీకృష్ఱుడు ఈ తల్లిని పూజించారు. సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.ఈ తల్లి శక్తిత్రయస్వరూపిణి.

శ్రీ సరస్వతీ దేవి... కాశ్మీర్‌లో శ్రీనగర్‌కు 40 కి.మీ. దూరంలో తుళుముల ప్రదేశంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి దక్షిణ హస్తం పడిందని చెబుతారు. సరస్వతీ దేవీని కీరవాణి అని పిలు స్తారు. పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణం కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తన ను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠం. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.

శ్రీ కామరూపా దేవి... అస్సాం గౌహతి సమీపంలోనీ నీలాచలపర్వతశిఖరం పై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాడమాసంలో స్రవిం చే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.

శ్రీ మాంగల్య గౌరీ దేవి... ఈ పీఠం బీహార్‌లోని గయాలో ఉంది. అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చేబుతారు. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరియైైన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి. శ్రాద్ధకర్మలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.

శ్రీ మాణిక్యాంబా దేవి... ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామంలో ఈ శక్తిపీఠం ఉంది. ఇది అమ్మవారి ఎడమ చెక్కిలి పడిన చోటుగా అభివర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ త్రిలింగం అనడానికి మూలమైనా త్రిలింగాలలో ద్రాక్షారామలింగం ఒకటి. ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చేబుతారు. ఇది దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నా యి. ఈ శివాలయం పంచారామాలలో ఒకటి.

శ్రీ విశాలాక్షీ దేవి... ఈ పీఠం ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో ఉంది. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. కాశీలో 1500 ఆలయాలకు పైగా ఉన్నాయి. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదానపుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం నిర్మించుకున్న పట్టణం కాశి. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలసిన ఫీఠం విశాలాక్షి పీఠం.

శ్రీ వైష్ణవీ దేవి... హిమాచలప్రదేశ్‌లో పఠాన్‌కోటలో జ్వాలా ముఖి రైల్వే స్టేషన్‌కు 20 కి.మి.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటిది. జమ్ములో కాట్రా వద్ద ఉన్న వైష్టోదేవీ ఆలయాన్ని శక్తిపీఠంగా చెపుతారు. భైరవనాథుడు అనే తాంత్రికుని బారి నుండి విష్ణుభక్తురాలైన ఒక బాలిక తప్పిం చుకుని, అతని తంత్రాలను తిప్పికొట్టిన కథ ప్రచారంలో ఉంది. ఈమెను వైష్ణవ దేవి అనీ పిలుస్తారు.

No comments:

Post a Comment