ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన మతాలు మరియు మతపరమైన
చిహ్నాలు కలిగి ఉన్నాయి. ఉదాహరణకు హిందూ మతం, బౌద్దమతం, టావోయిజం, మరియు
సిక్కు మతం, జైన మతం, ఇలా ఒక్కో దేశంలో వివిధ మతాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా మనకు తెలియని కొన్ని దేవస్థానాలు చాలా అద్భుతంగా రూపకల్పన
గావించబడ్డాయి. కొన్ని వేళ సంవత్సరాల క్రితమే వాటికి అద్భుతమైన రూపకల్పన
చేయబడినది. ప్రపంచంలో ఉన్న ప్రజలు ఆయా దేశాల్లో వివిధ మతాలు వారు వారి
మతానుచారంగా వివిధ దేవతలను ఆరాధిస్తారు. అయితే దేవాలయాలు మా్త్రం
ఎల్లప్పుడు అన్ని రకాల ప్రజల కోసం, భక్తుల కోసం, మరియు పర్యాటకులకు కోసం
ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.వాటిల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం...
విదేశీ పుణ్యక్షేత్ర సందర్శనం అత్యంత ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని. అక్కడి భాష, సాంఘిక అలవాట్లు, కట్టుబాట్లు తెలియక చాలామంది వెళ్లాలని బలమైన కోరిక ఉన్నా వెనుకంజ వేస్తుంటారు. సామాన్యుడికి సైతం ఈ ఆలయ సందర్శనం సులభం కావాలనే లక్ష్యంతో ట్రావెల్ ఛాయిస్ ఇంటర్నేషనల్ సంస్థ విదేశీ హిందూ దేవాలయాల సందర్శనకు వరల్‌డ వైడ్ హిందూ అనే పేరిట ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసి ఇటీవల ఒక కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
అనేక మంది ప్రయాణికులు తూర్పు దేశాల్లో ఉన్నటువంటి అద్భుతమైన దేవాలయాలను సందర్శించడానికి... దేవాలయాల నిర్మాణ నమూనాలు చూడటానికి.. పొందడానికి. అక్కడ వున్న దేవుళ్ళకు కానుకలు చెల్లించడానికి అనేక కారణాలతో దూరదేశాల దేవాలయాలను సందర్శిస్తుంటారు. మీరుకూడా ఇలా విహారయాత్ర చేయాలనుకొనే వారిలో ఒకరైతే ...మరియు ఆధ్యత్మిక ప్రదేశాల్లో చూడాలనే విశ్వాసం కలిగి ఉంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన…... అందమైన దేవాలయాలు జాబితా కొన్ని మీ కోసం. మీరు ఎప్పుడైనా ఇలా దూరదేశాల సందర్శనార్థం వెళ్ళాలనుకున్నప్పుడు ఇటువంటి వాటిని మీ మనస్సులో ఉంచుకోండి...
వాట్ ఫ్రా కేవో, బ్యాంకాక్:
పర్యాటక ఆకర్షణల్లో ప్రధానమైనది బ్యాంకాక్. వాటర్ సిటీ. బ్యాంకాక్ భారతీయ మూలాలు ఉన్న నగరం. దాంతో ఇక్కడ చాలా పేర్లు మన దేశ భాషలకు దగ్గరగా ఉంటాయి. ప్రధానంగా మన ప్రాచీన భాషలు పాళి, సంస్కృత భాషల ఆధారంగా వచ్చిన పేర్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టు పేరు సువర్ణభూమి. చారిత్రక ఆలయం వాట్ ఫ్రా కేవో. బ్యాంకాక్‌లో గ్రాండ్ ప్యాలెస్, ఎమరాల్‌డ బుద్ధ ఆలయం(వాట్ ఫ్రా కెవో) ఆవరణలోని విగ్రహాలను చూస్తుంటే జానపద చిత్రాన్ని చూస్తున్న భావన కలుగుతుంది. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం ఈ ప్రదేశం 15వ శతాబ్దంలో అయుత్తయ వంశ పాలకుల ఆధీనంలో ఉండేది. అప్పుడు దీని మొదటి పేరు సియాం. నగరం మధ్య నుంచి చో ఫ్రాయా నది ప్రవహిస్తుంది. ఇది అప్పట్లో చిన్న జలరవాణా కేంద్రం. తర్వాత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఆసియాలో పొడవైన నది. ఇది బ్యాంకాక్ నగరం మీదుగా గల్‌ఫ ఆఫ్ థాయ్‌ల్యాండ్ సముద్రంలో కలుస్తుంది. ఈ నదిలో క్రూయిజ్‌లో ప్రయాణించడం మెమొరబుల్ ఫీలింగ్.
ష్వేడగాన్ పగోడా మయన్మార్:
మయన్మార్ అనాగేనే డగాన్ పగోడా గ్రేట్ ఫేమస్. బర్మా మరియు మయన్మార్ అనే పేర్లు అధికంగా ఉన్న బర్మీయులు మరియు బామర్ సాంస్కృతిక ప్రజల వలన వలన వచ్చినవే. మాయన్మార్ సంప్రదాయ సమూహాల వ్రాత రూపం పేరు వలన మయన్మార్ అనే పేరు వచ్చింది. బర్మా గ్రామాలలో అత్యంత స్పష్టంగా, బర్మీస్ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఇక్కడ స్థానిక పండుగలు చాలా ఏడాది పొడవునా జరుగుతాయి. వీటిలో ముఖ్యమైన పండుగ పగోడా పండుగ. ప్రపంచ పురాతన చారిత్రక కట్టడాలో పగోడాస్ ఒకటి. ఈ స్థంభాన్ని నిజమైన బంగారు ప్లేట్లతో తయారు చేయడం విశేషం. ఇది పగలు, రాత్రి కూడా చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది.
తత్కషంఘ్ మోనాస్ట్రీ, భూటాన్:
భూటాన్ ఒకప్పుడు ప్రంచానికంతటికీ దూరంగా ఏకాంతంగా ఉండే దేశాలలో ఒకటి. కానీ ప్రస్తుతం దేశంలో సాంకేతిక మరియు ఇతర అభివృద్ది కారణంగా ప్రపంచానికి భూటాన్ ద్వారాలు తెరువబడ్డాయి. క్లిఫ్ వైపు ఉన్న పారో లోయ అద్భుతమైనది. ఇక్కడ ఉన్న మఠం1692లో ధ్యానం కోసం నిర్మించబడినది.ఇక్కడికి గురు రింపోచే(రెండవ బుద్ద) హిమాలయాల నుండి వచ్చి పులి అని వారి విశ్వాసం.
గోల్డెన్ టెంపుల్, ఇండియా:
ఇండియాలో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్ హర్మందీర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అద్భుతమైన పవిత్రమైన దేవాలయాల్లో ఇది ఒకటి. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ యొక్క గ్రంధాలయం బంగారు పూతతో పూసిన ఆలయం ఉంది. ప్రకాశించే ఈ గోల్డెన్ టెంపుల్ చుట్టూ వైట్ భవనాలు మరియు ఒక పవిత్రమైన సరస్సు కలిగి ఉన్నాయి.
ప్రాంబనాన్, ఇండోనేషియా:
ప్రపంచంలో ఇది మరొక అద్భుతమైన ఆలయం. ఈ హిందూ ఆలయంలో త్రిమూర్తి (బ్రహ్మ, విష్ణు, శివ)రూపాలతో కట్టబడినది. ఇది ఇండోనేషియా అతి పెద్ద హిందూమత దేవాలయం.
వాట్ రాంగ్ ఖూన్, థాయిలాండ్:
ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన దేవాలయాల్లో బాగా ప్రసిద్ది చెందిన దేవాలయం బౌద్ద దేవాలయం. పూర్తి తెలుపు వర్ణంలో ఈ దేవాలయం మొజాయిక్ అద్దాలతో అద్భుతంగా నిర్మించారు. ఈ దేవాలయం ఇంకా రూపకల్పన నిర్మాణంలో ఉంది.
బోరోబుదుర్, ఇండోనేషియా:
బోరోబుదుర్ 2672 ప్యానెల్‌స తో మరియు 504బుద్దుని విగ్రహాలతో అలంకరించబడినటువంటి అద్భుతమైన దేవాలయం . ప్రధాన గోపురానికి చుట్టూ 72 బుద్ద విగ్రహాలు నిర్మించబడి అద్భుతంగా ఉన్నాయి.రంగనాధ స్వామి దేవాలయం, ఇండియా: ప్రపంచంలో అద్భుతమైన దేవాలయాల్లో ఒక్కటి మాత్రమే కాదు. ఇది భారతదేశంలో ఉన్న ఆలయాలన్నింటిలోకి అతి పెద్ద హిందూ దేవాలయం. ఈ విష్ణు దేవాలయం దాని గోపురాలు చాలా ప్రసిద్ది చెందినవి.
ఆంగ్‌కోర్ వాట్:
భువిలో వైకుంఠాన్ని తలపించే ఆలయాన్ని మీరెప్పుడైనా చూశారా? ఆ ఆలయం కంబోడియాలో ఉంది. కంబోడియాలో తొమ్మిదో శతాబ్దిలో కేవలం 35 ఏళ్ల వ్యవధిలో నిర్మించిన వైకుంఠవాసుని దివ్యధామమైన ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం విశేషాలను తెలుసుకుందాం. ఒకప్పుడు కాంబోడియాను కాంభోజ దేశంగా పిలిచేవారు. యూరోపియన్ల ప్రభావంతో దీని పేరు కంపూచియాగా, కంబోడియాగా మారింది. కంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్ మహావిష్ణు ఆలయం ఒక మహాద్భుతం. సువిశాలమైన నీటి కొలను మధ్య భూమిని చదును చేసి, ఇసుక రాళ్లను, ఇసుకను పొరలు పొరలుగా పేర్చి, హిమాలయాల్లోని కైలాసం సహా ఐదు దివ్య శిఖరాలకు ప్రతీకగా ఐదు శిఖరాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీని నిర్మాణాన్ని తలపెట్టిన రాజు రెండవ సూర్యవర్మ. అతని మరణంలోగా ఆలయ నిర్మిస్తే మోక్షం లభిస్తుందని పండితులు చెప్పారు. వెంటనే ఆయన ఆలయ నిర్మాణం చేపట్టాడు.
రిజర్వాయర్:
ముందుగా ఆలయంలోని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించారు. దీని ద్వారా కరువు, వరద వంటి ప్రకృతి విపత్తులను నియంత్రించగలిగారు. ఒకదానికొకటి అనుసంధానమైన 1,500 కిలోమీటర్ల పొడవునా కాలువలు నిర్మించారు. ఇనుము, అల్యూమినియం వంటి నిర్మాణ సామగ్రి రవాణా కోసం ఈ కాలువలను ఉపయోగించుకున్నారు. ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే లాటరైట్ రాళ్లను ఎంపిక చేశారు. వాటిపై సియాన్‌రీవ్‌లోని కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుక శిలలను అతికించి, శిల్పాలు చెక్కారు. వాటిని అంత దూరం నుంచి ఇక్కడకు తరలించేందుకు ఏనుగులను, తేలియాడే బల్లకట్లను వాడారు. పలు దేశాల శిల్పులు, సుమారు ఐదువేల మంది కార్మికులు రాత్రింబవళ్లు ఈ నిర్మాణం కోసం శ్రమించారు.

No comments:
Post a Comment