Showing posts with label శనివారం తులసికోట వద్ద దీపమెలిగించండి. Show all posts
Showing posts with label శనివారం తులసికోట వద్ద దీపమెలిగించండి. Show all posts

శనివారం తులసికోట వద్ద దీపమెలిగించండి

శనివారం శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన రోజుగా పురోహితులు అంటున్నారు.అందుచేత శనివారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్వానమాచరించి తులసికోట ముందు నేతితో గాని, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా తులసికోట ముందు దీపమెలిగిస్తే.. ఆ గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం.

అలాగే శనివారం సాయంత్రం పూట శ్రీమన్నారాయణుని ఆలయాన్ని సందర్శించుకుని నేతితో దీపమెలిగించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోయి, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

శనివారం పూట ఒక పూట మాత్రమే భుజించి, శ్రీ వేంకటేశ్వర స్వామి, హనుమంతుడిని ధ్యానించే వారికి శనిగ్రహ ప్రభావంచే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

ఇంకా తొమ్మిది వారాల పాటు నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని, విష్ణుమూర్తి ఆలయాన్ని తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు సూచిస్తున్నారు.