Showing posts with label తులసీపూజ. Show all posts
Showing posts with label తులసీపూజ. Show all posts

తులసీపూజ విశిష్టత

తులసీపూజతో మంచి సంతానం పొందవచ్చునని పురోహితులు చెబుతున్నారు. తులసిని ఆరాధించడం వల్ల సౌభాగ్యం, మంచి సంతానం, ఆయుర్ వృద్ధి, ధనం, ఆరోగ్యం. ధాన్యం, ఫలసిద్ధి వంటి శుభ ఫలితాలుంటాయి.ఇంకా తులసీ దళాలతో పూజ చేసే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.

అందుచేత శుక్ర, శనివారాల్లో మహిళలు సూర్యోదయానికి ముందేలేచి శుచిగా తలస్నానమాచరించి, తులసి కోట ముందు దీపమెలిగించి, మూడుసార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.