శివపూజ మాసాలవారి సమర్పించవలసిన పూవులు - శివపూజ రహస్యాలు


 సువాసనలేని, సుగంధ వాసన కలిగిన పది పుష్పాలను శివలింగానికి సమర్పిస్తే అది శతసహస్ర మాలలతో పూజ చేసినటువంటి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది అని శివ ధర్మ సంగ్రహం అనే దానిలో చెప్పబడింది.
 శివుడి పటానికి లేదా శివలింగానికి రోజూ ఒక పువ్వును సమర్పిస్తే 80 లక్షల కోట్ల సంవత్సరాల వరకు దుర్గతి సంభవించదు.
 ఎవరైనా స్వయంగా పెంచిన పూలచెట్టు పువ్వులతో భక్తీశ్రద్ధలతో పూజించినవారికి శాశ్వత శివసాయుజ్యం తప్పకుండా పొందుతారు.
 పుష్పాలు, చెట్ల ఆకులతో శివుడికి సమర్పిస్తే ఆ చెట్లు కూడా పరమపదం పొందుతాయి.
 ఎవరైనా ఐదు పువ్వులతో శివుడిని పూజించినట్లయితే వారికి పది అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది.
 ఎవరైనా ఎనిమిది పువ్వులతో పరమేశ్వరుడిని పూజించినట్లయితే వారికి కైలాస ప్రాప్తి లభిస్తుంది.
మాసాలవారి పువ్వులతో శివపూజ ....
 చైత్రమాసంలో నృత్యం, గీతాలతో పరమేశ్వరుడిని సేవించి, దర్బ పువ్వులతో అర్చన చేసినట్లయితే వారికి పలు రకాల సువర్ణాలు లభిస్తాయి.
 వైశాఖ మాసంలో శివుడికి ఆవునెయ్యితో అభిషేకం చేయించి తెల్లని రంగు మందార పువ్వులతో పూజించినట్లయితే వారికి అశ్వమేథయాగం చేసిన పుణ్యఫలం దక్కుతుంది.
 జ్యేష్ఠ మాసంలో ఎల్లవేళలా పరమేశ్వరుడిని పెరుగుతో అభిషేకించి, తామరపువ్వులతో పూజ చేసిన వారికి ఉత్తమ పరమపదాలు పొందుతారు. (వారు)
 ఆషాఢమాసంలో బహుళ చతుర్థశి తదియ రోజు స్నానం చేసి శుచిగా తయారయ్యి ఇంట్లో కొంచెం గుగ్గిలంతో పూజగదిలో ధూపం వేసి తొడిమలతో ఉన్న పువ్వులను మాల చేసి శివుడికి వేసి అర్చించిన వారికి బ్రహ్మలోకాన్ని అధిగమించి పరమపదం పొందుతారు.
 శ్రావణ మాసంలో ఒంటి పూట మాత్రమే భోజనం చేసి, గన్నేరు పువ్వులతో పరమేశ్వరుడిని అర్చించిన వారికి వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలం పొందుతారు.
 భాద్రపద మాసంలో పరమేశ్వరుడిని ఉత్తరేణి పువ్వులతో అర్చించిన వారు హంసధ్వజంతో కూడుకున్న విమానంలో పుణ్యపదాలకు వెళతారు.
 ఆశ్వీయుజ మాసంలో పరమేశ్వరుడిని జిల్లేడు పువ్వులతో పూజించిన వారు మయూరధ్వజంతో కూడుకున్న విమానంలో శివపదానికి చేరుకుంటారు.
 కార్తీకమాసంలో పరమేశ్వరుడిని పాలతో అభిషేకం చేసి, జాజిపువ్వులతో పూజ చేసినవారు నిరంజనమైన శివపదాన్ని దర్శించుకుంటారు.
 మార్గశిర మాసంలో పరమేశ్వరుడిని పొగడ పువ్వులతో పూజించినవారు పరమపదం పొందుతారు.
 మాఘమాసంలో పరమేశ్వరుడిని బిల్వదళాలతో పూజిస్తారో వారు సూర్యచంద్రులు గల విమానంలో వెళతారు.
 ఫాల్గుణ మాసంలో పరమేశ్వరుడిని సుగంధ జలాలతో అభిషేకం చేసి తుమ్మపువ్వులతో పూజించినవారికి ఇంద్రుడి అర్థ సింహాసనాన్ని పొందుతారు.
ప్రతిరోజూ పరమేశ్వరుడిని ఒక జిల్లేడు పువ్వుతో పూజించినట్లయితే వారికి పది సువర్ణ ముద్రికలను దానం చేసినంత ఫలం కలుగుతుంది.

No comments:

Post a Comment