లక్ష్మీ కటాక్షం కోసం వివిధ రకాల పూజలు.

లక్ష్మీ కటాక్షం కోసం భక్తులు వివిధ రకాల పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తుంటారు. అలాగే లక్ష్మీదేవిని ఏ తిథులలో ఎటువంటి అభిషేకం చేయాలి? వారం రోజులలో లక్ష్మీదేవికి ఏ ప్రసాదం పెట్టాలి? అని చాలామందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం …
S.No ఏ తిథి అభిషేకం
1 పాడ్యమి ఆవు నేయితో అభిషేకం చేసినట్లయితే సకల రోగాలు నివారణ అవుతాయి.
2 విదియ చెక్కరతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది.
3 తదియ ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే ఎలాంటి అకాలమృత్యు దోషాలు తొలగిపోతాయి.
4 చవితి పిండివంటల నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు సంప్రాప్తిస్తాయి.
5 పంచమ అరటిపళ్ళు నైవేద్యం నివేదించడం వలన మేథస్సు, బుద్ధిశక్తి దిగ్వినీకృతం అవుతుంది (పెరుగుతుంది).
6 షష్ఠి తేనెతో అభిషేకించి చేసినట్లయితే, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది.
7 అష్టమి బెల్లం నీళ్ళతో అభిషేకించి, శుద్ధి బెల్ల్లం ఎవరికయినా దానం ఇవ్వడం వలన అష్టకష్టాలు తీరిపోయి సుఖంగా ఉంటారు.
8 నవమి పేలాలు నైవేద్యం నివేదించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
9 దశమి నల్లనువ్వులతో చేసిన పదార్థాలు నైవేద్యంగా నివేదించినట్లయితే సకల రోగాలు తొలగిపోయి దీర్ఘాయుష్మంతులు అవుతారు.
వారంలో అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం నివేదించాలి …
S.NO వారం నైవేద్యం
1 ఆదివారం పాలు
2 సోమవారం పాయసం
3 మంగళవారం అరటిపళ్ళు
4 బుధవారం వెన్న
5 గురువారం పటికబెల్లం
6 శుక్రవారం తీయని పదార్థాలు
7 శనివారం ఆవునెయ్యి

No comments:

Post a Comment