రాహు కేతు గ్రహాలు కన్య, మీన రాసులలో సంచరించే సమయమ లో కలిగే పలితాలు

రాహు కేతు గ్రహాలు ( జూలై 13, 2014 నుంచి 18 నెలల పాటు ) కన్య, మీన రాసులలో సంచరించే సమయమ లో ద్వాదశ రాసుల వారికి కలిగే

శుభాశుభ పలితాలు మరియు వారు పాటించాల్సిన పరిహరారాలు

 మేషం -
రాహువు - పని లో విజయం సాధించాలనే సంకల్పం అధికమవుతుంది. అలాగే విజయాన్ని కూడా దక్కించుకొంటారు
  మీ పై అధికారుల దృష్టి ని కూడా ఆకర్షిస్తారు.ఉద్యోగం లో మార్పుకోసం ప్రయత్నించే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి
అజీర్తి సమస్యలు కొంత బాధిస్తాయి
అప్పులు చేయడం తగ్గిస్తే మంచిది
పరిహారం - మీ కార్యాలయాన్ని శుభ్రం చేసేవారికి కండి పప్పు దానం చేయడం మంచిది

కేతువు - తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీ నిర్ణయాలు కూడా కొన్ని సార్లు సమస్యలు తెచ్చిపెడతాయి. ఏదైనా చెయ్యాలి అనుకొంటూ ఉంటారు కాని ఆచరణ లో ఏది పెట్టారు
దూరప్రాంతాలలో జీవించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి
తీర్థయాత్రలు చేయడం లేక ఆధ్యాత్మిక  ప్రదేశాలు సందర్శించడం చేస్తారు
ఖర్చులు ఎక్కువగా ఉండడం వలన ఆర్ధికం గా కొంత ఇబ్బంది గా ఉంటుందని చెప్పవచ్చు
పరిహారం - గణపతి ని పూజించడం

వృషభం

రాహువు - ప్రేమాభిమానాలు బలపడతాయి. కుటుంబ భద్రతకు కావలసిన చర్యలు తీసుకొంటారు
ఉద్యోగం లో మార్పు ఉండవచ్చు. ఆర్ధిక విషయాలలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు
విద్యార్దులు విద్యలో చక్కగా రాణిస్తారు
సంతానం కొరకు ఎదురు చూసేవారికి మంచి సమయం
తక్కువ సమయం లో ఎక్కువ సంపాదన కొరకై ఆశపడతారు. ఏదైనా నిజం తెలుసుకొన్న తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది
ఆహార నియమాల విషయం లో కొంచం అదుపు ఉంచడం మంచిది
పరిహారం - మరి సమస్యలు ఎక్కువ గా ఉంటె వెండి ఉంగరం ధరించడం మంచిది

కేతువు - వృత్తిరీత్యా మంచి పేరు సంపాదించుకొంటారు. ప్రమోషన్ కి అవకాశాలు కలవు. వృత్తిపరమైన ప్రయాణాలు చేస్తారు
చేతికందివచ్చిన సంతానం వలన అన్ని సౌఖ్యాలు కలుగుతాయి
మీరు అనుకొన్నది సాధించడానికి కొన్ని అవరోధాలు ఏర్పడతాయి
పరిహారం - నల్ల కుక్క కి ఆహారం పెట్టడం

మిథునం

రాహువు - ఇతరుల సహాయసహకారాలు కోరుతారు
స్థిరాస్తి పై రాబడి ఉంటుంది .కొన్ని సందర్బాలలో భావోద్వేగాల్ని అదుపు లో ఉంచుకోలేకపోతారు
డబ్బు సంపాదించడానికి ఇతర దారులు వెతుక్కోవడం మంచిది కాదు. మీ శ్రమ కి తగిన ఫలితం లభించదు. మీకు సంబందించిన పనులను మీరు స్వయం గా ఓర్పు తో చేసుకోవడం మంచిది
అనారోగ్య సమస్యలు బాదిస్తాయి
పరిహారం - సరస్వతి దేవి ని పూజించడం మంచిది

కేతువు - చేస్తున్న వృత్తి సంతృప్తినిస్తుంది.విదేశీ వ్యవహారాలలో మంచి అబివృద్ది ఉంటుంది
బందుత్వాలలో కోపతాపాలు, సుఖసంతోషాలు అన్ని మిశ్రమం గా లభిస్తాయి
తల్లి ఆరోగ్య విషయం లో కొంత అప్రమత్తత  గా ఉండాలి.కుటుంబానికి ప్రాధాన్యతనివ్వాలి.
ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు దాని గురించి క్షున్నం గా తెలుసుకోవాలి
పరిహారం - చిన్న వెండి గిన్నె లో తేనే ని నింపి ఇంట్లో పెట్టుకోవడం మంచిది

కర్కాటకం
రాహువు - సంతానానికి మంచి సమయం
వృత్తిరీత్యా సంతృప్తి గా ఉంటుంది
ప్రయాణాలు చాల ఉల్లాసం గా ఉంటాయి
అపార్ధాల వలన వైవాహిక జీవితం లో మనశాంతి లోపిస్తుంది
కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఎప్పటికప్పుడు మీ ఉత్సాహాన్ని పెంచే వార్తలు అందుకొంటూ ఉంటారు. ఒక పద్దతి లో అన్ని పనులు చేసుకొంటారు.

పరిహారం - ఎనిమిది ముఖాల రుద్రాక్ష వేసుకోవడం మంచిది
కేతువు- ప్రముఖ వ్యక్తులని కలుస్తారు .
విదేశీ ప్రయాణాలకు అవకాశం కలదు
కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పెద్దవారికి కొంత సమయం కేటాయించి వారి బాగోగులు చూడడం మంచిది.
ఇతరులతో అనవసరమైన వాగ్వివాదాల వలన మీకు చెడ్డ పేరు వస్తుంది
పరిహారం - బంగారు కమ్మలు ధరించడం. చిన్న బంగారు వస్తువు ని ఇంట్లో పెట్టుకోవడం

సింహం
రాహువు - విద్యార్దులకు మంచి అబివృద్ది ఉంటుంది
స్థిరాస్తి కొనుగోలు చేయడానికి అవకాశాలు కలవు
విదేశీ పర్యటనలు ఉంటాయి
సంఘం లో మీ సేవలకు గాను మంచి గుర్తింపు లభిస్తుంది
ఆరోగ్యం మెరుగు పడుతుంది
ఏదైనా పెద్ద పని మొదలు పెట్టేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించడం మంచిది. వ్యాపారం లో మీతో పోటి పడుతున్న వారు సమస్యలు సృష్టించే అవకాశం కలదు. ఆర్ధిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త గా వ్యవహరించాల్సి ఉంటుంది
పరిహారం - గోలి ఆకారం లో ఉన్న వెండి ని మీతో ఉంచుకోవడం మంచిది

కేతువు - అప్పులు తీర్చవలసి వస్తుంది
కుటుంబ సభ్యుల సహాయసహకారాలు లభిస్తాయి
ఇతరులకు ఆరికపరమైన హామీలు ఉండడం, పూచి సంతకాలు చేయకూడదు .పని ఒత్తిడి వలన గందరగోళం గా ఉంటుంది
పరిహారం - దుప్పటి లేదా బొంత ని ఏదైనా గుళ్ళో దానం చేయడం మంచిది

కన్య

రాహువు - ప్రయాణాలు బాగా సందడి గా ఉంటాయి
పాత వాహనాన్ని కాని, స్థిరాస్తి ని కాని అమ్మే అవకాశాలు కలవు
విదేశాలకు వెళ్ళడానికి మీరు కష్టపడి చేసే శ్రమ వృదాగా పోదు
మీకన్నా వయసులో చిన్నవారైన సోదరీసోదరులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కలదు
కొన్ని సందర్భాలలో మీ నిర్ణయాలు తప్పవుతాయి. ఏదో తెలీని భయం మీ మనసులో వెంటాడుతుంది, దీన్ని అధిగమించడానికి మీ జీవన విధానాన్ని ఒక క్రమబద్దత తో గడపడం మంచిది. ఆడవారి తో గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు.
పరిహారం - ప్రవహించే నదిలో కొబ్బరి కాయలను వదలడం మంచిది

కేతువు - వృత్తి లో మీరు ఆశించిన అబివృద్ది ఉంటుంది
వ్యాపారం లో భాగస్వామ్యాలకి అవకాశాలు కలవు
సామాజిక సేవ లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి
జీవిత భాగస్వామి తో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం  ఉంది.
కాళ్ళకి సంబంధించిన సమస్యల వలన వైద్య సలహాలు పాటించవలసి వస్తుంది
పరిహారం - గణపతి ని పూజించడం మంచిది

తుల -
రాహువు - విదేశాలలో ఉద్యోగావాకాశాలు కలవు
ఎప్పటినుండో అనుకొంటున్న విషయం ఒక కొలిక్కి వస్తుంది
కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి
స్నేహితులతో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది
ఆర్దికపరమైన సమస్యలు ఎదురవుతాయి
కుటుంబానికి సంబందించి కొన్ని సమస్యలు ఎదురవుతాయి
పరిహారం - ఇతరుల పై ఆధార పడకపోవడం మంచిది

కేతువు - సంతానం జీవితం లో స్థిరపడడానికి అనుకూల సమయం
పాత స్తిరాస్తి ని అమ్మే అవకాశం కలదు
కన్సల్టెన్సీ లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి
ఇల్లు మారే అవకాశం కూడా కలదు చేస్తున్న వృత్తిలో అన్ని విధాల మీరే ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ప్రయాణాలు కలసివస్తాయి
పరిహారం - ఎడమ చేతికి బంగారు ఉంగరం ధరించడం మంచిది


వృశ్చికం -
రాహువు - విదేశీ వ్యవహారాల తో మీకు ఒక ముఖ్యసందేశం అందుతుంది
తల్లితండ్రుల ఆరోగ్య విషయం లో శ్రద్ద వహించాలి
ప్రభుత్వపరంగా అందవలసిన అవకాశాలు అందుతాయి
రాజకీయం లో ఉన్నవారికి అన్నివిధాల మంచి అవకాశాలు అబివృద్ది ఉంటాయి
చేస్తున్న వృత్తి  లో మంచి అబివృద్ది ఉంటుంది
ఏదైనా కొత్త గా చేయాలని ప్రయత్నిస్తారు, ఈ నేపథ్యం లో కొన్ని ముఖ్యమైన వ్యక్తులని కలుస్తారు
పరిహారం - సమస్యలు ఉన్నప్పుడు బార్లీ ని ఏదైనా గుడి లో దానం చేయడం మంచిది

కేతువు - కష్టాలని చాలా దైర్యం గా అధిగమిస్తారు
ఆధ్యాత్మిక విషయాలు మీకు మనశాంతినిస్తాయి
వృత్తిరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది
విద్యార్దులు విద్యలో వెనకబాడతారు
మొండి గా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు కొద్దిగా ఓర్పుతో వ్యవహరిస్తే అన్ని మంచి లాభాలనిస్తాయి. మీకు వ్యతిరేకం గా ఉన్న వారికి ఎదురు వెళ్ళడం మంచిది కాదు. వారు మీకు ఆపదలు కలిగించ వచ్చు. అనవసరమైన ప్రయాణాలు తగ్గించడం మంచిది
పరిహారం - కుంకుమ పువ్వు ని నుదిటి పై తిలకం గా ధరించడం మంచిది

ధనుస్సు
రాహువు - అర్హతగల వారికి విదేశీ ఉద్యోగాలకి అవకాశాలు కలవు
జీవిత భాగస్వామి ద్వారా ఆర్దిక లాభం ఉంటుంది
భీమ వలన లాభ పడతారు
వృత్తిరీత్యా కొంత అసహనానికి గురి అవుతారు
చేస్తున్న పనులలో ఆటంకాలు ఎదురవుతాయి సమస్యలు ఎదురైనప్పుడు మీరు ధైర్యం గా ఎదిరించే ధోరణి మీకు అన్ని విధాల మంచే చేస్తుంది.
పెద్దవారితో, ప్రముఖులతో మీ పరిచయాలు బలపడతాయి
పరిహారం - సమస్యలు ఉన్నప్పుడు కళ్ళు లేని వారికి అన్న దానం చేయడం మంచిది

కేతువు - వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి
కోరుకొన్న ఉద్యోగం లభిస్తుంది
మంచి పేరు సంపాదించుకొంటారు
కొత్త కాంట్రాక్ట్ల లలో సంతకం చేస్తారు
కుటుంబ సభ్యుల కోసం సమయం వెచ్చిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు
స్నేహితుల వలన కొంత అసహనానికి గురిఅవుతారు
పరిహారం - పసుపు నిమ్మకాయాలని ప్రవహించే నీటిలో వదిలిపెట్టడం మంచిది

మకరం -
రాహువు - నూతన గృహప్రవేశానికి అవకాసం కలదు
సోదరీసోదరుల వలన ఆర్దికపరమైన లాభాలు చేకురుతాయి
మీ లక్ష్యాలని చేరగాలుగుతారు
ప్రభుత్వపరమైన వ్యవహారాలు మీకు అనుకూలం గా ఉండవు
ఆత్మా విశ్వాసం తో ముందుకు వెళ్తే విజయం సాదిస్తారు. పెద్దవారితో కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు పెంచుకోవాలి.
పరిహారం - కుంకుమపువ్వు ని తిలకం గా ధరించడం మంచిది

కేతువు - స్తిరాస్తులలో పెట్టుబడులు పెడతారు
ఆర్దికపరమైన సమస్యల నుండి బయటపడడానికి సోదరీసోదరుల సహాయం లభిస్తుంది
వృత్తిరీత్యా మంచి అభివృద్ధి ఉంటుంది
ఆధ్యాత్మికత మీద ఎక్కువ దృష్టి పెడతారు,తీర్థయాత్రలు కూడా చేస్తారు
అనారోగ్య సమస్యల కి వెంటనే వైద్యుల సలహాలు పాటిస్తే త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. అశ్రద్ద చేయడం మంచిది కాదు
మీ సలహాలు మంచి ఆదరణ పొందుతాయి. చాలా ఆత్మా విశ్వాసం తో ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి
పరిహారం - బంగారు  ధరించడం అలాగే బంధువులతో, స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించడం మంచిది
 
కుంభం

రాహువు - మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు
వ్యాపారరీత్యా మంచి అబివృద్ది ఉంటుంది
ఉద్యోగస్తుల కు ఎదురయ్యే ఆటంకాల వలన కొంత నిరుత్సాహం కలుగుతుంది.ఇతరులతో అనవసరమైన గొడవలు వస్తాయి
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి అనవసరమైన సందేహాలు కూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు అవసరైనప్పుడు వైద్య సలహాలు తీసుకోవడం మంచిది
పరిహారం - చతురస్రాకారం లో ఉండే వెండి ముక్కను మీతో ఉంచుకోవడం మంచిది

కేతువు - సంతానపరమైన సంతోషం ఉంటుంది
కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు
వ్యక్తిగత జీవితం వలన మానసిక అశాంతి
మీ మాటల మీద అదుపు ఉంచుకోవడం మంచిది. అనవసరమైన ప్రయాణాలు చేయకపోవడం మంచిది. కుటుంబం లో కూడా సమస్యలు ఎదురైనప్పుడు కొద్ది గా ఓర్పు తో వ్యవహరించడం మంచిది.
పరిహారం - కుంకుమ పువ్వు ని నుదిటి పై తిలకం గా ధరించడం మంచిది

మీనం
రాహువు- పూర్వీకుల ఆస్తి ద్వారా మీకు ఆర్దిక లాభాలు ఉంటాయి
జీవిత భాగస్వామి తో చిన్న చిన్న గొడవలు ఉంటాయి
విద్యార్దులు చదువు మీద దృష్టి పెట్టలేరు
ఆర్దిక సంక్షోభాన్ని అధిగమించడానికి అప్పులు చేస్తారు
ఊహాలోకం నుండి బయటకి రావడం మంచిది. నిత్యం జరిగే పనులలో కుడా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి
 పరిహారం - ఆరు కొబ్బరికాయలను సమస్యలు ఉన్నప్పుడు ప్రవహించే నీటి లో వదలడం మంచిది

కేతువు - బయట దేశం లో ఉద్యోగ అవకాశం లభిస్తుంది
దైవచింతన పెరుగుతుంది
ఒక ముఖ్యమైన లక్ష్యం చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు
మరీ ఎక్కువ ఆత్మవిశ్వాసం కూడా అన్ని వేళలా మీకు మంచి చేయదు. ఆరోగ్య విషయం లో శ్రద్ద వహించాలి
పరిహారం - కోతులకి బెల్లం ఆహారం గా పెట్టడం

No comments:

Post a Comment