ఆషాఢం నుంచీ కార్తీకం దాకా శ్రీ మహావిష్ణువు నిద్రించి వుంటాడట కదా! ఆ సమయంలో మన కష్టాలు తీరటంకోసం మనం చేసే జప పారాయణాదులు ఫలించవా

శ్రీహరి నిత్యనిర్ణద్రుడు. ఆషాఢం నుంచీ కార్తీకందాకా ఆయన చేసేది యోగనిద్ర. అది మామూలు నిద్రకాదు. అందుకే ఆ సమయంలో చేసే అనుష్ఠానాదులన్నీ అధికంగా ఫలిస్తాయనే ఆశయంతో యతీశ్వరులు, గృహస్థులుగూడా చాతుర్మాస్య వ్రతాలను ఆచరిస్తూ వుంటారు. ఆ సమయంలో ఆయనకు చేసిన పూజలేవీ ఫలించవనటం పొరపాటు. అవి ఇతోధికంగా ఫలిస్తాయి. ఫలితం రావటం ఆలస్యమయిందంటే, మనం ఇంకా పూజలు కొనసాగించాలని అర్థం చేసుకోవాలి.

No comments:

Post a Comment