మనం చేసే దోషాలు మనకు అంటకుండా తొలగించుకోవాలంటే గణపతిని ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుందో మీకు తెలుసా?
సూర్యదోషం తొలగిపోవాలంటే ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
చంద్రదోషం తొలగిపోవాలంటే పాలరాయితో లేదా వెండితో చేసిన గణపతిని పూజించాలి
కుజదోషం తొలగిపోవాలంటే రాగితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది
బుధ దోషం తొలగిపోవాలంటే మరకత వినాయకుడిని పూజించాలి
గురు దోషం తొలగిపోవాలంటే పసుపు, చందనంతో చేసిన లేదా బంగారంతో చేసిన వినాయకుడిని పూజించాలి.
శుక్రదోషం తొలగిపోవాలంటే స్ఫటిక వినాయకుడిని పూజించాలి
శని దోషం తొలగిపోవాలంటే నల్లరాయిపై చెక్కిన వినాయకుడిని పూజించాలి
రాహు దోషం తొలగిపోవాలంటే మట్టితో చేసిన వినాయకుడిని పూజించాలి
కేతుగ్రహ దోషం తొలగిపోవాలంటే తెల్లజిల్లేడుతో చేసిన వినాయకుడిని పూజించాలి.
అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ఎర్రచందనంతో చేసిన వినాయకుడిని పూజించాలి
ఋణ బాధలు తొలగిపోవాలంటే పగడపు వినాయకుడిని పూజించాలి.
మానసిక ప్రశాంతత కలగాలంటే పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
జీవితంలోని సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క వినాయకుడిని పూజించాలి
జీవితంలో సుఖశాంతుల లభ్యత కోసం స్ఫటిక వినాయకుడిని పూజించాలి.
No comments:
Post a Comment