► వైకుంఠవాసి శ్రీమహావిష్ణువును తులసి, తామర, తెల్లని సన్నజాజులు, అవిసెపువ్వులు అర్చన చేసినవారు విష్ణుపదాన్ని పొందుతారు.
► కడిమి పుష్పాలతో పూజించి అర్చించిన వారికి స్వర్గ సుఖాలు కలుగుతాయి. కడిమి పుష్పాలను విష్ణు తలపై రాశిగా పోసి అలంకరించినవారికి వెయ్యి ఆవులను దానం చేసిన ఫలితం దక్కుతుంది.
► శ్రీ మహావిష్ణువును కార్తీకమాసంలో సన్నజాజి పువ్వులతో పూజ చేసిన వారికి నూరు కపిల గోవులను దానం చేసిన ఉత్తమ ఫలం దక్కుతుంది.
► శ్రీ మహావిష్ణువును వసంత ఋతువులో మల్లికా పువ్వులతో పూజించిన వారికి మనోవాక్కాయలతో సంప్రాప్తించిన పాపాలు దహించుకుని పోతాయి.
► శ్రీమహావిష్ణువును వసంత ఋతువులో సురపొన్న పుష్పాలతో పూజ చేసినవారు ముక్తుడైన యోగి అవుతారు
► శ్రీమహావిష్ణువు అవతారమైన మాధవుని దవనంతో పూజించిన వారికి వంద కపిల గోవులను దానం చేసిన ఉత్తమ ఫలం పొందుతారు.
► శ్రీమహావిష్ణువును అవిసె పువ్వులతో మాలను అల్లి అర్చించి సమర్పించిన వారికి ఇంద్రాధిపతి దేవేంద్రుడు కూడా అంజలి (నమస్కారం)ఘటిస్తాడు.
► శ్రీమహావిష్ణువును అనంత అశోక పువ్వులతో పూజించిన వారు ఆచంద్ర తారార్కము శోకరహితులుగా సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు.
► శ్రీమహావిష్ణువును అన్ని కాలాలలో మామిడి మొక్క పూతను విష్ణువు శిరస్సుపై పెట్టి పూజిస్తారో వారికి కోటి గోవులను దానం చేసిన ఫలం దక్కుతుంది.
► శ్రీమహావిష్ణువును జమ్మిపత్రితో పూజించి అర్చించిన వారికి మహా ఘోరమై ఉన్న మార్గం కూడా సులభంగా దాటగలరు.
► శ్రీమహావిష్ణువును వర్ష ఋతువులో చంపక పుష్పాలతో పూజించిన వారికి పునర్జన్మ అనేది ఉండదు.
► శ్రీమహావిష్ణువును కలిగొట్టు పువ్వులతో పూజించిన వారికి సువర్ణం దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది
► శ్రీమహావిష్ణువును బంగారు వర్ణం కలిగి ఉండే మొగలి పువ్వులతో పూజించిన వారికి కోటిజన్మలలో ఆర్జించిన పాపపు రాశి భస్మమై పోతుంది
► శ్రీమహావిష్ణువును భూలోకంలో ఉన్న అన్ని పువ్వులతో పూజించి అర్చించిన వారికి ఎటువంటి ఫలితం ప్రాప్తిస్తుందో అటువంటి ఫలితం కేవలం తులసిదళంతో శ్రీమహావిష్ణువును పూజించడం వలన లభిస్తుంది.
No comments:
Post a Comment